విడాకుల తర్వాత తనపై విమర్శలు రావడంతో సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చిన విషయం ప్రేక్షకులకు గుర్తు ఉండే ఉంటుంది. విడాకులు తీసుకోవడానికి ప్రేమలో ఉన్నప్పుడు..నాగ చైతన్యపై ప్రేమను సైతం అదే విధంగా వ్యక్తం చేసేవారు. తమ ప్రేమకు గుర్తుగా ఒంటిపై పచ్చబొట్టు (టాటూలు) కూడా వేయించుకున్నారు..
అక్కినేని నాగ చైతన్యను ఇంట్లో కుటుంబ సభ్యులు, పరిశ్రమలో స్నేహితులు ముద్దుగా ‘చై’ అని పిలుస్తారు. సమంత ఆ పేరును రిబ్స్ మీద టాటూగా వేయించుకున్నారు. ఇంతకు ముందు ఆ టాటూ కనిపించేలా ఫోటోలు కూడా పోస్ట్ చేశారు. లేటెస్టుగా దుబాయ్ వెళ్లిన సమంత..పింక్ కలర్ శారీలో ఓ కార్యక్రమానికి హాజరు అయ్యారు. అక్కడ ఫోటోలు దిగి పోస్ట్ చేశారు. అవి చూస్తే..రిబ్స్ మీద ‘చై’ పేరు లేదు. ఆ టాటూను తొలగించారు. ఇంతకు ముందు ఫొటోలు, లేటెస్ట్ ఫొటోలు చూస్తే ఆ మార్పు తెలుస్తుంది..!!