in

samantha praises and calls it ‘movie of the year’!

చిన్న సినిమాని ఆకాశానికి ఎత్తింది సమంత..ఆ చిత్రం మరేదో కాదు మలయాళ స్టార్ మమ్ముట్టి – జ్యోతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన “కాథల్ ది కోర్”. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ దర్శకుడు జియో బేబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మరోసారి ఆయన వ్యూ డిఫరెంట్ గా ఉందని ప్రూవ్ చేసింది. ఫ్యామిలీ డ్రామా అధ్యంతం కేరళ అభిమానులను అలరించింది. దీంతో ఈ చిత్రాన్ని ఇతర భాషలలో కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి చిత్రాన్ని భారతీయ ప్రజలందరూ చూడాల్సిన అవసరం ఉందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.

కానీ స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఈ చిత్రం ఉందని కువైట్, ఖతర్ వంటి దేశాలు ఈ చిత్రాన్ని బ్యాన్ చేశాయి. ఇదిలా ఉంటే..ఈ చిత్రాన్ని ఉద్దేశించి సమంత ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. “సినిమా ఆఫ్ ది ఇయర్. మమ్ముట్టి సార్.. మీరే నా హీరో. జ్యోతిక లవ్ యూ. జియో బేబీ లెజెండరీ. ఇద్దరూ ఎంతో గొప్పగా నటించారు. నా సంతోషాన్ని మీతో పంచుకోకుండా ఉండలేకపోయాను. అందుకే ఇలా మీ ముందుకు వచ్చాను. మీ నుండి ఇలాంటి చిత్రాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను” అంటూ సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

anil ravipudi to direct chiranjeevi soon?

rajamouli: appudu varma, ippudu vanga