in

anil ravipudi to direct chiranjeevi soon?

టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు అపజయమే ఎరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరుచుకున్నాడు. యాక్షన్, కమర్షియల్ కంటే ఎక్కువ కామెడీతో మెప్పించే ఈ యంగ్ టైగర్ నుంచి చంటబ్బాయి లాంటి ఎంటర్ టైనర్ ని ఫ్యాన్స్ ఆశిస్తారు. అయితే మాస్ క్లాస్ ని రెండూ హ్యాండిల్ చేయడంతో రావిపూడి అనుభవం సరిలేరు నీకెవ్వరుతోనే ప్రూవ్ అయ్యింది కాబట్టి పెద్దగా అనుమానాలు లేవు కానీ ఎలాంటి కథను రాశాడనేది ఆసక్తి రేపుతోంది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఛాన్స్ వస్తే చిరంజీవిని ఆషామాషీగా చూపించనని చెప్పిన సంగతి గుర్తే.

వకీల్ సాబ్ ద్వారా పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలన్న లక్ష్యాన్ని తీర్చుకున్న దిల్ రాజుకి ఇప్పుడు చిరంజీవితో అయిపోతే సంపూర్ణంగా ఫీలవుతారు. రామానాయుడు లాగా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలందరితోనూ SVC లో సినిమాలు ఉండాలన్నది రాజుగారికి కోరిక. కాస్త టైం పడుతున్నా సరే అన్నీ తీర్చేసుకుంటున్నారు. తమిళంలో ఆల్రెడీ విజయ్ తో మొదలుపెట్టి మంచి బోణీ కొట్టేశారు. రజినీకాంత్ ది తృటిలో మిస్ అయ్యింది కానీ మళ్ళీ సెట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం విశ్వంభర చేస్తున్న చిరంజీవి నెక్స్ట్ ఒప్పుకునే ప్రాజెక్ట్ అనిల్ రావిపూడిదే కావొచ్చేమో చూడాలి..!!

biggest flop for young beauty sreeleela!

samantha praises and calls it ‘movie of the year’!