in

Samantha Plans To Buy A Flat In Mumbai?

టాలీవుడ్ స్టార్స్ దృష్టి ముంబైపై ప‌డింది. అక్క‌డ ఇండ‌స్ట్రీపై దృష్టి పెట్ట‌డ‌మే కాదు ముంబైలో ఖ‌రీదైన ఫ్లాటులు కొనుగోలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రామ్ చ‌ర‌ణ్ ముంబైలో కాస్ట్‌లీ బంగ్లా కొని హెడ్ లైన్స్‌లో నిలిచారు. ఇప్ప‌టికే ఈ ఇంటి గృహ ప్ర‌వేశం కూడా పూర్తైంద‌ని సమాచారం. ఇక ఇప్పుడు మ‌రో టాలీవుడ్ స్టార్ ముంబైలో ఫ్లాట్ కొనుగోలు చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌.  అక్కినేని కోడ‌లు స‌మంత ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా మారిన విష‌యం తెలిసిందే.

ఈ అమ్మ‌డు ఇటీవ‌ల ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్ తో అన్ని భాష‌ల‌కు చెందిన ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. ఈ వెబ్ సిరీస్ త‌ర్వాత స‌మంత‌కు హిందీ సినిమా ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయ‌ట‌. ఈ క్ర‌మంలో ముంబైలో ఫ్లాట్ కొనుగోలు చేయాల‌ని సామ్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం స‌మంత .. గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కిస్తున్న శాకుంత‌లం అనే చిత్రంలో న‌టిస్తుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హిందీలోను భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌నున్నారు.

anasuya’s another adorable photoshoot!

‘KALA SAGAR’ VEDIKA KU ADYAKSHATHA VAHINCHAKUNDA VELLIPOINA BHANUMATHI!