in

Samantha In Allu Arjun – atlee movie?

రీసెంట్ గా షారుఖ్ ఖాన్ తో కూడా జవాన్ అనే సినిమాను తెరకెక్కించి అద్భుతమైన కలెక్షన్స్ సాధించాడు అట్లీ. ఇక్కడితో అట్లీ రేంజ్ వేరే లెవెల్లో పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు అట్లీ నుంచి సినిమా వస్తుందంటే పాన్ ఇండియా లెవెల్ లో ఎదురుచూస్తున్నారు అనడం అతిశయోక్తి కాదు. ఇకపోతే అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా అనౌన్స్ చేయనున్నారు.

ఇకపోతే అల్లు అర్జున్ తో అట్లీ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా సమంత నటించినున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే అల్లు అర్జున్ సరసన సమంత సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమాలో నటించింది. అలానే అట్లీ దర్శకత్వం వహించిన తేరి సినిమాలో కూడా విజయ్ సరసన సమంత నటించింది. ఇప్పుడు మళ్లీ మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటే అందరూ క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు..!!

Offers flowing for anupama after romancing tillu high!

Pooja Hegde and Naga Chaitanya to reunite after 10 years?