in

Samantha getting paid more than Nagarjuna to host Bigg Boss!

కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసమని హిమాలయాలకు వెళ్ళాడు. అయితే ఆయన అక్కడే మూడు వారాల పాటూ షూట్ లో పాల్గొనాల్సి ఉంది. అందుకే నాగార్జున హొస్ట్ చేస్తున్న బిగ్ బాస్ నాలుగో సీజన్ ను ఇప్పుడు ఆయన కోడలు సమంత హొస్ట్ చేస్తోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. 5 వారాల పాటు ‘బిగ్ బాస్4’ ను హోస్ట్ చేయబోతుందట సమంత. ఈమెకు సినిమాల్లో చేస్తే కోట్లల్లో రెమ్యునరేషన్ ఇస్తారు. మరి ‘బిగ్ బాస్4’ 5 ఎపిసోడ్స్ హోస్ట్ చెయ్యడం కోసం ఎంత పారితోషికం అందుకోబోతుంది? అనే విషయం తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంది.

సమంతకు ఈ 5 వారాలకు గాను ఏకంగా రూ.2.10 కోట్లు చెల్లించబోతున్నారని తెలుస్తుంది. అంటే ఒక్కో ఎపిసోడ్ కు 40లక్షలు పైనే ఇస్తున్నారు. సీజన్ మొత్తం హొస్ట్ చేసేందుకు నాగార్జున 8కోట్ల వరకూ పారితోషికం అందుకుంటున్నాడు. 5 ఎపిసోడ్స్ కే సమంతకు 2.10 కోట్లు అందుకుంటుంటే.. సీజన్ మొత్తం హోస్ట్ చేస్తే 10కోట్లకు పైనే తీసుకుంటుందేమో. ఏమైనా బుల్లితెర పై కూడా సమంత సెన్సేషన్ సృష్టిస్తుందని స్పష్టమవుతుంది.

adah sharma ‘question mark’ ready to release!

Payal Rajput reveals her weight loss story!