in

adah sharma ‘question mark’ ready to release!

క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోన్న స‌మ‌యంలో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం` ?` క్వ‌శ్చ‌న్ మార్క్. హీరోయిన్ ఓరియెంటెడ్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆదాశ‌ర్మ మెయిన్ లీడ్ లో న‌టించింది. సంజ‌య్, అభ‌య్, భానుశ్రీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై విప్రా దర్శకత్వం లో గౌరీ కృష్ణ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆఖ‌రి ద‌శ‌లో ఉన్నాయి. ఇటీవ‌ల మినిస్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ చేతుల మీదుగా లాంచ్ చేసిన పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లో ఈ చిత్రంలోని పాట‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్బంగా నిర్మాత గౌరీ కృష్ణ మాట్లాడుతూ “మా శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై ఆదా శర్మ హీరోయిన్ గా నిర్మిస్తున్న క్వ‌శ్చ‌న్ మార్క్ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆఖ‌రి ద‌శ‌లో ఉన్నాయి. ఇటీవ‌ల త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ గారి చేతుల మీదుగా విడుద‌ల చేసిన పోస్టర్ కు మంచి స్పంద‌న ల‌భించింది. ఈ కరోనా సమయం లో అన్ని జాగ్రత్తలు తీసుకుని మా టీమ్ పూర్తి సహకారం ఏ ఇబ్బంది లేకుండా షూటింగ్ పూర్తి చేయ‌గ‌లిగాం. టైటిల్ కు, పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. షూటింగ్ మొత్తం హైదరాబాద్ మరియు మహారాజపురం అడవుల్లో చేసాము. అతి త్వ‌ర‌లో మా చిత్రంలోని పాట‌ను రిలీజ్ చేసి సినిమాను కూడా త్వ‌ర‌లోనే థియేట‌ర్స్ లో అయినా ఓటీటీ లో అయినా రిలీజ్ చేయ‌డానికి సిధ్దం అవుతున్నాం“ అన్నారు.

thandri mulanga super star ga unna career nu thyagam chesina Kalyan Chakravarthy!

Samantha getting paid more than Nagarjuna to host Bigg Boss!