in

Salman Khan-Pooja Hegde’s ‘Kabhi Eid Kabhi Diwali’ not shelved!

తెలుగుకి ప్రస్తుతం టాప్ హీరోయిన్స్‌లో ఒకరు పూజా హెగ్డే. ఒక లైలా కోసం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అవుతుంది. వరుసగా పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంటుంది పూజా.. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో సినిమా చేస్తుంది. ఇప్పటికే బాలీవుడ్లో హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలతో చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో సినిమా చేస్తుంది. ఈ సినిమాకు కభీ ఈద్ కభీ దీపావళి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

అయితే ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు దాంతో.. ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలను తిప్పికొట్టారు మేకర్స్. సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన మేకర్స్ .. సినిమా ఆగిపోలేదని తెలిపారు. అలాగే ఇప్పటికే సినిమాకోసం సెట్ కూడా నిర్మిస్తున్నారని.. రెండు నెలల్లో సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ టైగర్’ ఫ్రాంచైజీలో రాబోతున్న పార్ట్ 3‌లో నటిస్తుంది.

rakul preet singh no longer to play condom tester on screen!

nikesha patel latest stills in black short dress!