in

rakul preet singh no longer to play condom tester on screen!

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఓ పక్క తెలుగు సినిమాలు చేస్తూనే.. మరోపక్క హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతోంది. ఈ క్రమంలో తనకు ఏదైనా కథ కొత్తగా అనిపిస్తే వెంటనే ఒప్పేసుకుంటోంది. ఇలానే ‘ఛత్రివాలి’ అనే సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఇందులో ఆమె కండోమ్ టెస్టర్ పాత్రలో కనిపించడానికి రెడీ అయింది. ఈ విషయం తెలిసినప్పుడు ఆమె ఫ్యాన్స్ షాకయ్యారు. ఇలాంటి బోల్డ్ రోల్ లో రకుల్ ఎలా నటిస్తుందోనని అనుకున్నారు.

దర్శకుడు తేజస్ విజయ్ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు సోషల్ మీడియాలో రకుల్ పై ట్రోలింగ్ జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని సమాచారం. నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారట. సినిమా రిలీజ్ అయ్యే సమయానికి మరిన్ని వివాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావించిన ఆయన ప్రాజెక్ట్ ను ఆపేసినట్లు తెలుస్తోంది. మరి దర్శకుడు తేజస్ కొత్త ప్రొడ్యూసర్ ను వెతుక్కుంటాడేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ అటకెక్కినట్లే. మరోపక్క రకుల్ కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది. దాదాపు అరడజనుకి పైగా బాలీవుడ్ సినిమాలు ఆమె చేతిలో ఉన్నారు.

iddaru gayakulu paadina maya bazar paata!

Salman Khan-Pooja Hegde’s ‘Kabhi Eid Kabhi Diwali’ not shelved!