తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో తెలుగులో తన తొలి హీరో.. వరుణ్‌తేజ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘తెలుగులో నేను తొలిసారి నటించింది వరుణ్‌తోనే అందుకే ఆయన నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. నా హైట్ ఏమో.. 5.4 అయితే.. వరుణ్ 6.4 అడుగుల ఎత్తు ఉంటాడు. దాంతో మేమిద్దరం కలిసి నటించే సీన్లలో తప్పనిసరిగా హీల్స్ వేసుకునేదాన్ని. సెట్స్‌పై వరుణ్ చాలా సరదాగా కనిపిస్తాడు.
కానీ తీరా మానిటర్ చూస్తే, అతని భావాలు, నటన వ్యక్తం చేసిన తీరు వేరేలా ఉంటుంది. సినిమా చిత్రీకరణ జరిగినన్నీ రోజులు ఇంటికెళ్లాక మా అమ్మకు ఈ విషయాన్ని పదే పదే చెప్పేదాన్ని. వరుణ్ తేజ్ నటన చూసి ఎంతో నేర్చుకున్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే ‘ఫిదా’తో నేను వరుణ్ నటనకు ఫిదా అయ్యాను’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇక సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లవ్ స్టోరీ’ చిత్రంలో నటిస్తోంది. .