in

sai pallavi in soundharya’s biopic?

త కొన్ని రోజులుగా టాలీవుడ్ లో బయోపిక్ ల హవా అనేది పెరిగిన సంగతి తెలిసిందే. బయోపిక్ లో చేయడానికి చాలామంది స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. దర్శక నిర్మాతలు మాత్రం ఇప్పుడు బయోపిక్ విషయంలో కాస్త ఆలోచనలో పడ్డారు. సావిత్రి బయోపిక్ తెలుగులో మంచి విజయం సాధించిన సరే బయోపిక్ చేయడానికి మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు జనాలు. అయితే ఇప్పుడు మాత్రం ఒక బయోపిక్ కి సంబంధించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా సౌందర్య బయోపిక్ తీసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే సౌందర్య కుటుంబం తో చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కథ కూడా సిద్ధమైందని టాక్. ఈ సినిమాలో సాయి పల్లవి సౌందర్య పాత్రలో నటించే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ సినిమాను తెలుగులో తమిళంలో కన్నడంలో మలయాళంలో మొత్తం నాలుగు భాషల్లో తీసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది..

vijay devarakonda as army officer?

rashmi gautham is ready for marriage!