in

Sai Pallavi Clarifies Rumors on Quitting Movies!

తాజాగా సాయి పల్లవి పై కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ఈమె ఇప్పటికే డాక్టర్ వృత్తిని అభ్యసించిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా సాయి పల్లవి సినిమాలను వదిలిపెట్టనుందని డాక్టర్గా స్థిరపడటానికి ఈ నిర్ణయం తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి..ఈ విషయంపై స్పందించిన సాయి పల్లవి.. “ప్రేమమ్‌ సినిమాతో నా సినీప్రయాణం మొదలైంది. ఆ సినిమా అంత పెద్ద విజయం సాధిస్తుందని నేను ఊహించలేదు. ఆ చిత్రంలో నేను చేసిన పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయ్యారు. నా పేరు చెప్పగానే గుర్తొచ్చే పాత్రల్లో అది ఒకటి. నేను ఎంబీబీఎస్‌ చదివినా.. నటిని కావాలనుకున్నాను.

నా నిర్ణయానికి మా తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. నేను నటించిన సినిమాలు ప్రేక్షకులకు నచ్చాలని అనుకుంటాను. నా పాత్రలు వాళ్లకి ఎప్పటికీ గుర్తుండాలని భావిస్తాను. నన్ను అందరూ తమ ఇంటి ఆడపడుచుగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మంచి కథలు ఉంటే ఏ భాషలో అయినా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.. అలాగే సినిమాలో వదిలిపెట్టాలి అనే ఆలోచన ఇప్పట్లో లేదు కొన్నాళ్లు అనుకున్న విధంగా సినిమాల్లో కొనసాగి ఆ తర్వాత మాత్రమే వైద్యవృత్తిని ఎంచుకుంటాను.. ” అంటూ చెప్పకు వచ్చారు సాయి పల్లవి..!!

sensational Sree Leela bags two Biggies in Tollywood?

Vijay Devarakonda Devara Santa Contest: 100 Fans To Go For Holiday!