
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. ఇప్పుడు సాయి దుర్గా తేజ్ గా మారిన తాను తన సెకండ్ ఇన్నింగ్స్ ని మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక నేడు తన పుట్టినరోజు కావడంతో సినీ ప్రముఖులు అభిమానులు తనకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఇపుడు అనౌన్స్ చేశారు.
తన కెరీర్ 19వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని ఓటిటిలో సూపర్ హిట్ అయ్యిన సిరీస్ సేవ్ ది టైగర్స్ దర్శకుడు తేజ కనుమను తెరకెక్కించనున్నట్టు నేడు ప్రకటించారు. సో వీరి కలయికలో సాలిడ్ ఎంటర్టైనర్ ని ఆశించవచ్చు. ఇక మరిన్ని వివరాలు ముందు రోజుల్లో రానున్నాయి. అలాగే సాయి తేజ్ సంబరాల ఏటి గట్టు వచ్చే ఏడాది విడుదల కానున్న సంగతి తెలిసిందే..!!

