
నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘అలియాస్ రుక్మిణి’ సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. బాలీవుడ్ యువ నటి ఆఫియా సయ్యద్‌ను రుక్మిణి పాత్రలో పరిచయం చేస్తూ చిత్ర బృందం అక్టోబర్ 13న ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేసింది. నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్న ఈ చిత్రంలో ఆఫియా అందమైన రూపంతో పాటు కఠినమైన స్వభావం కలిగిన స్కూల్ టీచర్‌గా కనిపించనుంది. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది..ఆఫియా సయ్యద్ ఇటీవల హిందీ చిత్రం ‘ప్రేమ్ కీటాను’లో వీర్ పహారియా సరసన నటించింది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం మలయాళ హిట్ ‘ప్రేమలు’కు హిందీ రీమేక్..
ఇప్పుడు ‘అలియాస్ రుక్మిణి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. తొలి తెలుగు చిత్రంలోనే కథకు కీలకమైన టైటిల్ పాత్ర దక్కడం ఆమెకు ప్రత్యేక అవకాశం..నితిన్, నాని మధ్య సినీ ప్రయాణంలో ఆసక్తికరమైన అనుబంధం ఉంది. గతంలో నితిన్ నటించిన ‘అల్లరి బుల్లోడు’ చిత్రానికి నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాను నాని సమర్పిస్తుండటం విశేషం. యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవాసోత్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. సాయికుమార్, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు..!!
