కృష్ణం రాజు గారిని ని అందరు రెబెల్ స్టార్ అంటారు, ఆయన ఒక విలక్షణమయిన నటుడు, రెబెల్ క్యారెక్టర్స్ ఎంత ఫెరోషియస్ గ చేస్తారో, ఉదాత్తయిన, కరుణ రసం కురిపించే పాత్రలు కూడా ఆయన ఎంతో జనరంజకంగ చేసారు. “అమర దీపం” “మనవూరి పాండవులు”,” భక్త కన్నప్ప” వంటి చిత్రాలు దానికి చక్కని ఉదాహరణ. కృష్ణం రాజు గారు తన మొదటి చిత్రం “చిలక గోరింక” లో మహానటుడు ఎస్.వి.ఆర్. తో కలసి నటించారు, ఆ సమయం లో ఎస్.వి.ఆర్. తో ఆయన తోలి అనుభవం గురించి తరచూ చెప్తుండేవారు కృష్ణం రాజు గారు. చిలక గోరింక చిత్రంలో ఎస్.వి.ఆర్. కాంబినేషన్ సీన్ షూట్ చేయాలి, షూటింగ్ ఏమో హైద్రాబాద్లో సీన్ పేపర్ మద్రాస్ నుంచి రావాలి, ఆత్రేయ గారి సంగతి తెలిసిందే గ ఆయన వెంటపడి రాయించిన సీన్ పేపర్ హైదరాబాద్ చేరటానికి నాలుగు రోజులు పట్టింది. ఎస్.వి.ఆర్. గారి కాల్ షీట్ లాస్ట్ రోజు, సీన్ ఏమో కొండవీటి చాంతాడు అంత ఉంది, ఆ సీన్ పేపర్ చూసిన ఎస్.వి.ఆర్. ఏమయ్యా కొత్త కుర్రాడితో ఇంత పెద్ద సీన్ ప్లాన్ చేసారు, ఇది పూర్తి అయ్యేదెప్పుడు నేను మద్రాస్ వెళ్ళేది ఎప్పుడు అంటూ చిరాకు పడుతూనే సెట్లోకి వచ్చారట.
రాత్రి ఏడున్నరకు షూటింగ్ ప్రారంభం అయింది, కృష్ణం రాజు గారి పరంగా ప్రతి షాట్ సింగల్ టేక్ లో ఒకే అవ్వటం, నెక్స్ట్ షాట్ కు వెళ్లడం జరుగుతుంది, ఇది గమనించిన ఎస్.వి.ఆర్. కృష్ణం రాజు గారిని గమనిస్తూ షాట్స్ పూర్తి చేసేసారు, ఒక రోజు పడుతుంది అనుకున్న సీన్ రెండు గంటలలో పూర్తి చేసేసారు. సీన్ పూర్తి అవ్వగానే ఎస్.వి.ఆర్. కృష్ణం రాజు గారిని పిలిచి ” ఒరేయ్ అబ్బాయ్ చాల బాగా చేసావు, వెల్ డన్, కీప్ ఇట్ అప్” అంటూ భజం తట్టి, మొత్తానికి భలే వాడిని పట్టుకొచ్చావయ్యా ప్రత్యెగాత్మ అని చెప్పి మద్రాస్ వెళ్లిపోయారట. మద్రాస్ వెళ్లిన ఎస్.వి.ఆర్. కనిపించిన నిర్మాతలకు, డైరెక్టర్లకు కృష్ణం రాజు గురించి చెపుతూ, ప్రతేగాత్మ” బలే నా కొడుకును పట్టుకొచ్చాడయ్యా” వన్ డే సీన్ ని, టూ అవర్స్ లో చేసేసాడు అని పొగడ్తలతో ముంచేసారట. ఆ విషయం చెబుతూ,అది తిట్టు కాదు ఆ మహానటుడి ఆనందం లో నుంచి వచ్చిన ఆశీర్వాదం అని చెప్పి పులకించి పోయే వారు కృష్ణం రాజు గారు.ఎస్.వి.ఆర్., యెన్.టి.ఆర్. అంటే కృష్ణం రాజు గారికి ఎంతో ఆరాధన భావం. సినిమాలోకి రాక ముందు నుంచి అక్కినేని కి వీరాభిమాని కృష్ణం రాజు గారు..!!