in

CAMERA MANTRIKUDI KI KOPAM VACHINA VELA!

మార్కస్ బార్ట్లే” కెమెరా మాంత్రికుడు”, వెండి తెర మీద వెండి వెన్నెల కురిపించిన చందమామ. గ్రాఫిక్స్ వంటి టెక్నాలజీ లేని రోజుల్లో తన పనితనం తో వెండి తెర మీద చిత్ర,విచిత్రాలు ఆవిష్కరించిన అభినవ బ్రహ్మ. శ్రీలంకలో జన్మించి,మద్రాస్ లో సెటిల్ అయిన ఆంగ్లో ఇండియన్ సంతతి కి చెందిన మార్కస్ చిన్న నాటి నుంచి కెమెరా పైన మక్కువ పెంచుకున్నారు. మార్కస్ బార్ట్లే కెమెరా పనితనానికి మాయాబజార్ ఒక గొప్ప ఉదాహరణ, విజయ వారి చిత్రాలలో ఎక్కడో ఒక చోట చంద్రుడు కనిపించటం,వెన్నెల కురిపించటం చాల మామూలు విషయం. ఆ సన్నివేశాలను అత్యంత సహజంగా చిత్రీకరించేవారు మార్కస్ బార్ట్లే. ఆయన సన్నివేశాలు చిత్రికరించే ముందు లైటింగ్ సెట్ చేయటానికి చాల సమయం తీసుకునే వారు,ఎంతటి మహానటులు అయిన ఆయన లైటింగ్ సెట్ చేసే వరకు ఎన్ని గంటలు అయిన అలాగే ఉండేవారట. మాయ బజార్ చిత్రంలో ఒక స్కీన్లో ఎస్.వి.ఆర్. తో ఒక ట్రిక్ షాట్ కి లైటింగ్ సెట్ చేయటానికి 6 గంటలు పట్టిందట అంత సేపు, ఎస్.వి.ఆర్. వంటి నటుడు అలాగే కదలకుండా కూర్చుండిపోయారట.

కె.వి. రెడ్డి గారి సాహచర్యం వల్లనో ఏమో సెట్ లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలనే వారట బార్ట్లే. తెలుగులో బార్ట్లే చివరి చిత్రం చక్రవాకం, ఇందులో శోభన్ బాబు, వాణిశ్రీ కాంబినేషన్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు లైటింగ్ సెట్ చేసుకుంటున్న బార్ట్లే, వాణిశ్రీని కదలకుండా కోర్చుమన్నారట, కానీ వాణిశ్రీ గారు కుదురుగా కూర్చోకుండా, మేక్ అప్ మాన్ తో మాట్లాడుతూ, టచ్ అప్ చేసుకుంటూ కదులుతున్నారట. వాణిశ్రీని కదలకుండా కూర్చోమనండి అని అసిస్టెంట్ డైరెక్టర్ తో చెప్పించారట బార్ట్లే, అయిన వాణిశ్రీ కదులుతుండటం తో చిర్రెత్తిన బార్ట్లే అక్కడ ఉన్న స్టూల్ ను ఒక్క తన్ను తన్ని,” ఐ కాంట్ డు థిస్” అని సెట్ లో నుంచి కోపంగా బయటకు వెళ్లిపోయారట. దూరంగా ఉన్న నిర్మాత రామ నాయుడు, ఆయనతో ఉన్న నాగి రెడ్డి, చక్రపాణి గారు ఇది గమనించి, బార్ట్లే సంగతి వాణిశ్రీకి చెప్పి కదలకుండా కూర్చో, లేకుంటే షూటింగ్ ఆపేసి వెళ్ళిపోతాడు బార్ట్లే అని చెప్పారట. అంతటి తో వాణిశ్రీ కుదురుగా కూర్చోవటం, లైటింగ్ సెట్ చేసుకోవటం పూర్తి చేసిన బార్ట్లే ఆ సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రకరించారట. నాలుగు దశబ్దాల బార్ట్లే సినీ జీవితం లో అయన పని చేసింది యాభై చిత్రాలే, రాసి కన్నా వాసి ముఖ్యం..!!

It’s a hat-trick for beauty Alia Bhatt in 2022!

Amala Paul sensational comments on Tollywood families!