in

rowdy star Vijay Deverakonda to romance Katrina Kaif!

పూరి జగన్నాథ్ ‘లైగర్’తో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తున్నాడు. అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. అందులో విజయ్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించబోతోందట.

ఇదిలా ఉంటే ఇటీవల ఇన్ స్టాలో విజయ్ దేవరకొండను ఫాలో అవటం మొదలు పెట్టింది కత్రినా కైఫ్‌. తెలుగునాటే కాదు విజయ్ కి దేశం మొత్తంలో చక్కటి ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్ ష్టాలో ఎక్కవ మంది ఫాలో అవుతున్న హీరోల్లో విజయ్ ముందు వరుసలో ఉంటాడు. నిజానికి విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ మే 9న విడుదల కావాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల అంతా తారుమారు అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను కరోనా తగ్గగానే ప్రకటిస్తారట.

allu arjun to team up with muragadas for gajini sequel?

ismart beauty nidhi agarwal in mahesh babu and trivikram movie?