in

ismart beauty nidhi agarwal in mahesh babu and trivikram movie?

త్రివిక్రమ్ గత రెండు సినిమాల్లోనూ పూజా హెగ్డేనే కథానాయికగా నటించింది. ఇప్పుడు మాటల మాంత్రికుడు ఫేవరెట్ ఆమే. మహేష్ సైతం ఇంతకుముందు పూజాతో కలిసి చేసిన ‘మహర్షి’తో మంచి విజయాన్నందుకున్నాడు కాబట్టి తనను హీరోయిన్‌గా తీసుకుంటే నో అనడు. కానీ పూజా డేట్లు ఖాళీ లేకపోవడంతో ఈ సినిమాలో నటించలేకపోతోందట.తమిళంలో విజయ్ సరసన భారీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో..

కోలీవుడ్లో పాగా వేయడానికి ఇదే మంచి ఛాన్స్ అని ఆమె బల్క్ డేట్లు ఇచ్చేసింది. వీటికి తోడు వేరే కమిట్మెంట్లు కూడా ఉండటంతో మహేష్-త్రివిక్రమ్ సినిమాకు ఆమె కాల్ షీట్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. దీంతో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న వాళ్లలో నిధినే బెస్ట్ అని ఆమెను ఈ సినిమా కోసం ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే వరుసగా పవన్, మహేష్‌ బాబులతో నటించబోతున్న నిధి కెరీర్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం.

rowdy star Vijay Deverakonda to romance Katrina Kaif!

dinesh naidu alias vishwak sen reveals the secret behind his name!