చిరంజీవి గారిది ఒక ప్రత్యేకమయిన మనస్తత్వం, అయన కారణం గ ఎవరికీ కొంచెం కూడా నష్టం జరగ కూడదు, తన వలన ఎవరు బాధ పడ కూడదు అని, అందరిని గమనించుకుంటూ ముందుకు సాగె మనస్తత్వం. దానికి ఉదాహరణ గ సినిమా ఇండస్ట్రీ లో చాల సంఘటనలు ఉన్నాయి, అందులో ఒక సంఘటన హీరొయిన్ రోజా గారి విషయం లో జరిగింది. రోజా గారు అప్పుడే ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో “ఘరానా మొగుడు” చిత్రంలో సెకండ్ హీరొయిన్ క్యారెక్టర్ కి రోజా గారిని సెలెక్ట్ చేసారు. కానీ కారణం ఏమిటో తెలియదు కానీ ఆ క్యారెక్టర్ కి వాణి విశ్వనాధ్ గారిని తీసుకోవటం జరిగింది. రోజా గారు చాల ఫీల్ అయ్యారు , చిరంజీవి గారి ప్రక్కన నటించే అవకాశం తప్పిపోయినందుకు.
విషయం తెలుసుకొన్న చిరంజీవి గారు, అయ్యో కెరీర్ స్టార్టింగ్ లో ఇలా వచ్చిన క్యారెక్టర్ వేరే వాళ్లకు పోతే, అది ఆమె కెరీర్ మీద ప్రభావం చూపుతుంది, కాబట్టి తరువాతి సినిమా లో అవకాశం ఇస్తానని చెప్పండి అని చెప్పారట. సినీ పరిశ్రమలో ఇదంతా సర్వ సాధారణం, ఒకరు చేయవలసిన క్యారెక్టర్ చివరి నిమిషం లో ఇంకొకరు చేయటం, కానీ చిరంజీవి గారు మాత్రం ఆలా సాధారణంగ తీసుకోలేదు, తన తరువాతి చిత్రం” ముఠా మేస్త్రి “లో రోజా గారికి మంచి క్యారెక్టర్ ఇచ్చి మాట నిలబెట్టుకొని, రోజా గారిని ప్రోత్సహించారు. ఆ క్యారెక్టర్ తరువాత రోజా గారి కెరీర్ గ్రాఫ్ ఊపు అందుకున్నది అని చెప్పవచ్చు.