రోజా.. ఒకప్పుడు తెలుగు, తమిళ్లో అగ్ర కథానాయకులందరితో ఆడిపాడారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా బిజీ అయ్యారు. నటిగా సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసి ‘గోలీమార్’, ‘కోడిపుంజు’ వంటి సినిమాలు చేశారు. ఆ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే ఆమె వెండితెరకు దూరమై చాలా కాలమైంది. రోజాను సినిమాల్లో నటింప చేయాలని దర్శక నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ రాజకీయాలు, టీవీ షోలకే సమయం సరిపోవడం లేదని ఆమె ససేమిరా అనేస్తూ వచ్చారు. అయితే రీసెంట్గా ఓ ఛానెల్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ రోజాను యాంకర్.. ‘చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే యాక్ట్ చేస్తారా?’ అని ప్రశ్నించగా.. తాను ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నానని.. ఒకవేళ చిరంజీవి, నాగార్జున సినిమాల్లో కనుక అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు.