
ప్రముఖ నటి రెజీనా కసాండ్రా బాలీవుడ్‌పై, ముఖ్యంగా దర్శక నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాను నటించిన ‘కేసరి చాప్టర్ 2’ సినిమా ప్రమోషన్లలో తనను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారని, దక్షిణాది నటిని కావడం వల్లే ఈ వివక్ష ఎదురైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు భారత సినీ పరిశ్రమలో ‘నార్త్ వర్సెస్ సౌత్’ చర్చను మరోసారి రాజేశాయి.
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘కేసరి 2’లో ఆయన భార్యగా కీలక పాత్ర పోషించినప్పటికీ, ప్రమోషన్ల సమయంలో తన పేరును తొలగించారని రెజీనా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. “నాపై చిత్రీకరించిన పాటను విడుదల చేసి, సోషల్ మీడియాలో కనీసం ట్యాగ్ కూడా చేయలేదు. నేను సౌత్ ఇండియన్ నటిని కావడం వల్లే ఇలా చేశారా?” అని ఆమె ప్రశ్నించారు. ఇటీవల సౌత్ సినిమాలపై జాన్వీ కపూర్, రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలపైనా ఆమె తీవ్రంగా స్పందించారు. ఉత్తరాది నటులు ఇలా బహిరంగంగా మాట్లాడటం వల్ల అనవసరంగా నార్త్-సౌత్ విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు..!!

