in

Payal rajput shows gratitude in being associated with Tollywood!

Payal rajput shows gratitude in being associated with Tollywood!

తెలుగు చిత్ర పరిశ్రమపై నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె వ్యాఖ్యలపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నటి పాయల్ రాజ్‌పుత్ స్పందించారు. టాలీవుడ్‌కు మద్దతుగా నిలుస్తూ రాధికా ఆప్టే వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చారు. తనకు గుర్తింపు, అవకాశాలు ఇచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఇన్నేళ్ల తర్వాత విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు..

ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన పాయల్ రాజ్‌పుత్..తనకు టాలీవుడ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నానని, ఇక్కడ ప్రతి ఒక్కరికీ ఇచ్చే గౌరవం, కొత్తవారిని ఆహ్వానించే విధానం తనకు ప్రత్యక్షంగా తెలుసని చెప్పారు. వ్యక్తిగత హద్దులు, నిర్ణయాలు ఎవరి ఇష్టమని పేర్కొంటూనే.. కెరీర్‌కు పునాది వేసిన పరిశ్రమ మొత్తాన్ని తప్పుబట్టడం మాత్రం సమంజసం కాదన్నారు..!!

Official Confirmation: sreeleela in ajith’s dare devil