in

regina cassandra excited doing negative roles!

తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ చిన్నది పలు వైవిధ్య పాత్రల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ‘ఎవరు’ చిత్రంలో ప్రతినాయకి పాత్రలో నటించి ఆకట్టుకుందీ చిన్నది. ఈ సినిమా విజయవంతమవడంలో కీలకపాత్ర పోషిందినడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇదిలా ఉంటే రెజీనా మరోసారి విలన్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన ‘చక్ర’ సినిమాలో ‘లీలా’ పాత్రలో నటించిన రెజీనా మంచి మార్కులు కొట్టేసింది.

ప్రతి నాయకి పాత్రలో కనిపించిన రెజీనా ఈ పాత్రలో జీవించింది. ఈ పాత్ర గురించి రెజీనా మాట్లాడుతూ.. లీలా పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. దర్శకుడు ఆనందన్‌ తనను రెండుసార్లు కలిసి కథను వినిపించారని రెజీనా చెప్పుకొచ్చారు. మొదట్లో సినిమాలో నటించడానికి అంగీకరించలేదని.. తర్వాత సినిమాటోగ్రాఫర్‌ బాలసుబ్రమణ్యన్‌ ఫోన్‌ చేసి ప్రతినాయకి పాత్రలో మీరు నటిస్తే బాగుంటుందని చెప్పారని తెలిపారు. దీంతో సినిమాలో నటించడానికి అంగీకరించానని చెప్పుకొచ్చారు. ఇక భవిష్యత్తులోనూ వైవిధ్యభరిత పాత్రల్లో నటించడానికి తాను సిద్ధమేనని తేల్చి చెప్పింద.

Director Teja Announces Sequel To ‘Chitram’ Movie!

Vishwak Sen gives Strong Warning To Youtube Channel!