in

Ravi Teja’s First Attempt of this new Genre!

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ సినిమా ఘనవిజయం సాధించడంతో ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన వరుసగా రెండు కొత్త ప్రాజె క్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన నెక్స్ట్ మూవీ కోసం రవితేజ ఈసారి సరికొత్త జోనర్ ట్రై చేయనున్నాడట. అందులో భాగంగా టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ తొలిసారిగా ఒక హారర్ కామెడీ చిత్రంలో నటించనున్నాడట. ఈ కథ నచ్చడంతో రవితేజ వెంటనే అంగీకరించాడని తెలుస్తుంది..

దిల్ రాజు మాజీ భాగస్వామి లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు హసిత్ గోలీ దర్శకత్వంలో శ్రీవిష్ణుతో కలిసి రవితేజ మరో మల్టీస్టారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కూడా నటించనున్నారు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా విడుదల కానుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరి హారర్ కామెడీ చిత్రంతో రవితేజ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి..!!

Ananthika Sanilkumar confirmed as the female lead in ‘Yellamma’!?

Power Star Pawan Kalyan Celebrates 55th Birthday With Love Ones!