రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఈ ఆగస్టు 15న విడుదలకి సిద్ధం అవుతోంది. హరీష్ శంకర్ దర్శకుడు, ఈ సినిమా అజయ్ దేవగన్ నటించిన హిందీ సినిమా ’ది రైడ్’ సినిమాకి అనువాదం. ఈ సినిమా తరువాత రవితేజ దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు. వారిద్దరి కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా. ఇంతకు ముందు వారిద్దరూ కలిపి ‘డాన్ శీను’, ;బలుపు’, ’క్రాక్’ సినిమాలు చేశారు. ఇప్పుడు వీరిద్దరూ కలిపి నాలుగో సినిమాకి శ్రీకారం చుట్టారు, ఇందులో శ్రీలీల కథానాయిక..
ఈ సినిమా తరువాత రవితేజ ఇంకొక సినిమా కూడా ఒప్పుకున్నారని తాజా సమాచారం. ’నేను శైలజ’ లాంటి మంచి విజయాన్ని అందించిన కిషోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకుడిగా పని చేస్తారని తెలుస్తోంది. కిషోర్ తిరుముల చివరి సినిమా ‘ఆడవాళ్ళు విూకు జోహార్లు’, శర్వానంద్ ఇందులో కథానాయకుడు. ఇది 2022లో వచ్చింది. ఆ తరువాత కిషోర్ తిరుమల తన కథపై పనిచేస్తూ వున్నారని, ఈమధ్యనే రవితేజకి కథని వినిపించడం జరిగిందని కూడా తెలిసింది.కథ నచ్చి రవితేజ సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది..!!