in

kriti sanon rumoured to be dating UK businessman Kabir Bahia!

దిపురుష్ సినిమా సమయంలో ప్రభాస్ తో రిలేషన్ షిప్ గూర్చి బాలీవుడ్ మీడియా పని గట్టుకుని ప్రచారం చేసింది. అవన్నీ వదంతులని తేలింది. తాజాగా కృతి బాయ్ ఫ్రెండ్ ఎవరో బయట పడింది. ప్రముఖ బిజినెస్ మెన్ ‘క‌బీర్ బహియాతో’ కృతి లవ్ లో ఉందని సమాచారం. కొంత‌కాలంగా గ్రీస్ వెకేషన్ లో ఉన్న కృతి అక్కడే తన లవర్ తో, తన 34 వ పుట్టినరోజు జరుపుకుంది. గ్రీకు ద్వీపమైన ‘మైకోనోస్‌’లో కృతి – కబీర్ కలిసి పార్టీ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

క‌బీర్ బ‌హియా లండన్ లో ఉన్న ఒక పెద్ద బిజినెస్ ఫ్యామిలీకి చెందిన ప్రముఖుడు. వరల్డ్‌వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజం లిమిటెడ్ కి య‌జ‌మాని. కబీర్ తండ్రి ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ అయిన ‘సౌతాల్ ట్రావెల్’ వ్యవస్థాపకుడు..కృతి ఇప్పటివరకు తన బాయ్ ఫ్రెండ్ గూర్చి, పెళ్లి గూర్చి బయట పెట్టకపోవటానికి కారణం కబీర్ కృతి కంటే తొమ్మిదేళ్లు చిన్న‌వాడు. ఈ క్రమంలోనే పెద్దలు పెళ్ళికి అంగీకారం తెలపలేదని, వారు ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకోవాలని వేచి చూస్తున్నట్లు టాక్. కృతి తరచుగా కబీర్ కోసమే లండన్‌ వెళ్తోందని సమాచారం..!!

ravi teja signed back to back movies!

ram gopal varma did not recognized cricketer ms dhoni!