in

Ravi Teja and Siddu Jonnalagadda to team up for an exciting remake!

రవితేజతో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ రొమాన్స్!
మా
స్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో రానున్న మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మూవీ బాలీవుడ్ లో అజయదేవగన్, ఇలియానా నటించిన రైడ్ కి రీమేక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోరే హీరోయిన్ గా నటిస్తోంది.ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌కి పేరుగాంచిన రవితేజ ఈ యాక్షన్-కామెడీలో అందాల తార భాగ్యశ్రీ బోర్స్ తో జతకట్టారు. ఈ చిత్రంలో జగపతి బాబు బలమైన విలన్ గ మరొక్క సరి తన యాక్టింగ్ ట్యాలెంట్ ను చూపించనున్నాడు.ఈ మధ్య రీసెంట్ గా ఒక నెటిజన్ రీమేక్ సినిమా అని మాట్లాడగా హరీష్ ఓన్లీ లైన్ మాత్రమే తీసుకుని చాలా మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. దీనితో హరీష్ మార్క్  స్క్రీన్ ప్లే ఎక్సపెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. ఆగస్టు లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

రవితేజతో టిల్లు సందడి – అదరగొట్టే అతిథి పాత్రలో యంగ్ హీరో!
ఆగస్టు 15 న థియేటర్స్ లో రిలీజ్ కాబోయే ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరో సిద్దు జొన్నలగడ్డ క్యామియో రోల్ చేస్తున్నాడని   సమాచారం. సిద్దు రోల్ కి సంబంధించి షూట్ ఆల్ రెడీ కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తోంది. DJ టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న సిద్దు ఈ మూవీలో క్యామియో రోల్ చేయటంపై పలువురిలో ఆసక్తి నెలకొంది. టిల్లుకి ప్రస్తుతం ఉన్న ఇమేజ్ తో సోలో హీరో గా సినిమాలు చేస్తూనే, మరో పక్క ఇలా గెస్ట్ రోల్స్ లో కూడా నటిస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ పవర్-ప్యాక్డ్ కాస్ట్, డైనమిక్ డైరెక్టర్ మరియు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల తేదీ ఉండడం ఇంకో విశేషం..మరి చూద్దాం రవి తేజ మళ్ళి తన మార్క్ హిట్ కొడుతాడో!

f cube ‘tollywood’!

ismart beauty Missed A Big Comeback Opportunity!