in

RASHMIKA SAID NO TO NAGA CHAITANYA !

ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మందన్నా.. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం చేస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఆమె దిల్ రాజు బ్యానర్‌లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కనున్న చిత్రానికి నో చెప్పిందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.

ఈ మూవీని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అటు దిల్ రాజు బ్యానర్.. ఇటు అక్కినేని వారసుడు.. ఇంతకంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇంకేం ఉంటుంది. ఏ హీరోయిన్ అయినా ఓకే చెబుతుంది. కానీ రష్మిక మాత్రం ఈ సినిమాను ఒప్పుకోలేదట. దానికి కూడా ఓ రీజన్ ఉందని సమాచారం. రెమ్యునరేషన్… ప్రొడ్యూసర్.. హీరోను దృష్టిలో పెట్టుకుని కాకుండా బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే.. అందులో తన పాత్ర నచ్చితేనే ఒప్పుకోవాలని రష్మిక నిర్ణయం తీసుకుందట. అందుకే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ చదివిన తర్వాతే ఓ డెసిషన్ తీసుకుంటానని నిర్మాతలు చెప్పినట్లు వినికిడి.

ఈ మధ్య వరుస ప్లాప్స్‌తో రష్మిక క్రేజ్ తగ్గిపోయింది. అందుకే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో మరింత జాగ్రత్త పడాలని నిర్ణయం తీసుకుందట ఈ అందాల భామ.

F CUBE ‘PRABHAS’!

RAVISHING POOJA HEGDE IN YELLOW !