తాజాగా రష్మికకి సంబందించిన ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. రష్మిక కోసం బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసిందని టాక్. లేడీ ఓరియెంటెడ్ మూవీ తీసేందుకు సిద్ధంగా ఉందని, దీనికోసం 100 కోట్ల బడ్జెట్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు మొదలయ్యాయని, ఓ స్టార్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తారని తెలుస్తోంది..
ఒక సౌత్ హీరోయిన్ కోసం ఇంత బడ్జెట్ పెట్టడం అంటే మామలు విషయం కాదు అదంతా రష్మిక క్రేజ్ & డెడికేషన్. ఇంతవరకు ఏ బాలీవుడ్ హీరోయిన్ కి దక్కని అరుదైన గుర్తింపు రష్మిక సొంతం చేసుకుంది. బాలీవుడ్ మేకర్స్ ఎవరూ ఏ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కోసం ఇంత బడ్జెట్ పెట్టలేదు. రష్మిక కూడా ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలు చేసింది తప్ప లేడీ ఓరియెంటెడ్ కథలు చేయలేదు. కానీ 100 కోట్లు బడ్జెట్ వెనక్కి తెచ్చే సత్తా రష్మికకి ఉందని మేకర్స్ మాత్రం నమ్ముతున్నారు..!!