in

Rashmika Mandanna’s 8-Hour Daily Training for Mysaa!

విజయ్ తో వివాహం తర్వాత కెరీర్‌పై రష్మిక మరింత పట్టుదలగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె బ్యాంకాక్‌లో ‘మైసా’ చిత్రం కోసం అత్యంత కఠినమైన యుద్ధ శిక్షణ తీసుకుంటోంది. ఈ సినిమాలో ఆమె ఒక పోరాటం చేసే గోండు మహిళగా కనిపించబోతోంది. ఆ పాత్రకు న్యాయం చేసేందుకు అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో, ప్రఖ్యాత ‘జైకా స్టంట్ టీమ్’తో కలిసి ప్రతిరోజూ దాదాపు 8 గంటల పాటు మార్షల్ ఆర్ట్స్ మరియు స్టంట్ టెక్నిక్స్‌ను నేర్చుకుంటోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఆమె ఈ చిత్రంలో ఊర మాస్ యాక్షన్ అవతారంలో గర్జించబోతోందని చిత్ర యూనిట్ పేర్కొంది.

మైసా సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ రష్మికలోని ఉగ్రరూపాన్ని పరిచయం చేసింది. ఫిమేల్ లీడ్ ఓరియెంటెడ్ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ (నేరుగా తలపడే యుద్ధం) లో రష్మిక పండిస్తున్న హావభావాలు హాలీవుడ్ స్థాయిని తలపిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఒక నెల రోజుల విరామం తర్వాత విజయ్ – రష్మిక ఇద్దరూ తమ సినిమాలతో బిజీ అవ్వగా, రష్మిక చేస్తున్న ఈ సాహసం ఆమె కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా మారుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..!!

Ananya Nagalla faces negativity on instagram subscription!