
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ‘హాయ్ నాన్న’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శౌర్యువ్‌తో ఆయన ఈ చిత్రాన్ని చేస్తున్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో విజయ్, నాని కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు ప్రముఖ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘హాయ్ నాన్న’కు అద్భుతమైన సంగీతం అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్, ఈ చిత్రానికి కూడా స్వరాలు సమకూర్చనున్నారు. ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి..!!

