in

Rashmika Mandanna turns blind for animal?

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ యానిమల్ మూవీలో హీరోగా రణవీర్ కపూర్, హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై బజ్ ను పెంచుతూ వచ్చాయి. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, అమ్మాయి సాంగ్ చూస్తే, సందీప్ రెడ్డి వంగా మార్క్ ఉంటుందని అర్థమవుతుంది. సందీప్ లాస్ట్ మూవీ అర్జున్ రెడ్డి తరహాలోనే వైయోలెంట్‌గా, రొమాంటిక్‌గా ఉంటుందని తెలిసిపోతుంది. అయితే ఈ సినిమాలో రష్మిక పాత్ర గురించి మాత్రం క్లారిటీ రావడం లేదు.

సినిమా యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తే..ట్రెడిషనల్ పాత్రలో రష్మిక కనిపించబోతుందని తెలుస్తుంది. కానీ, కథాపరంగా రష్మిక పాత్ర చాలా వైయోలెంట్ గా ఉంటుందని వినిపిస్తుంది. అయితే ఇటీవల సినిమా నుంచి వచ్చిన కొన్ని ఫోటోలను చూస్తే మాత్రం సినిమాలో రష్మిక కళ్లు లేని అమ్మాయి పాత్రలో నటిస్తుందని అర్థమవుతుంది. ఇటీవల రిలీజ్ సాంగ్ లో రష్మిక ఎక్స్ ప్రెషన్స్ చూస్తే కళ్లు లేని అమ్మాయి అనే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

happening beauty Sreeleela dismisses marriage reports!

happy birthday pooja hegde!