in

Rashmika Mandanna roped in for Ravi Teja’s next?

ష్మిక..ఇప్పటిదాకా చాలామంది స్టార్లతో సినిమాలు చేసింది కానీ.. అందులో చాలా వరకు క్లాస్ టచ్ ఉన్న చిత్రాలే. కానీ రవితేజ అంటూ పక్కా మాస్ ఉంటుంది. గోపీచంద్‌తో అతడి కాంబినేషన్ సూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. డాన్ శీను, బలుపు, క్రాక్.. ఇలా మూడు సినిమాలూ ఒకదాన్ని మించి ఒకటి విజయం సాధించాయి. ‘క్రాక్’ తర్వాత మల్లీ వీరి కలయికలో సినిమాను అనౌన్స్ చేయగానే మంచి హైప్ వచ్చింది. ఈ చిత్రానికి కథానాయికగా పలు పేర్లను పరిశీలించారు.

శ్రుతి హాసన్‌ను రిపీట్ చేయడం..శ్రీలీలను తీసుకోవడం గురించి కూడా చర్చ జరగింది. కానీ చివరికి రష్మికను ఓకే చేశారు. రష్మిక ఈ టైంలో నిజానికి నితన్ సరసన వెంకీ కుడుముల సినిమాలో నటించాల్సింది. కానీ ఓ హిందీ చిత్రం కోసం ఆమె ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో తన డేట్లు కొన్ని వృథా అయ్యాయి. ఈలోపు నితిన్ సినిమాకు వేరే హీరోయిన్ని తీసుకున్నారు. ఇలాంటి టైంలోనే రవితేజ-గోపీచంద్ సినిమా నుంచి పిలుపు రావడంతో ఆమె సంతోషంగా ఒప్పుకుంది..!!

Sai Pallavi and Naga Chaitanya to repeat their love story again!

Krithi Shetty To Pair Up With Sharwanand!