in

Sai Pallavi and Naga Chaitanya to repeat their love story again!

టాలీవుడ్ లో ఉన్న పలు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ లో అయితే సెన్సేషన్ హిట్ అయ్యిన నాగ చైతన్య..లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కాంబినేషన్ ఒకటి. మరి ఈ కాంబినేషన్ నుంచి వచ్చిన మొదటి సినిమా “లవ్ స్టోరీ” పెద్ద హిట్ కావడంతో వీరి జంటకి మంచి క్రేజ్ ఏర్పడింది. మళ్ళీ ఈ క్రేజీ కాంబినేషన్ కన్ఫర్మ్ అయ్యిపోయింది. దీనిని అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసేసారు. కాగా ఈ చిత్రాన్ని కార్తికేయ 2 ఫేమ్ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తుండగా దిగ్గజ బ్యానర్ గీతా ఆర్ట్స్ వారు భారీ స్కేల్ లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు..

ఈ గుడ్ న్యూస్ ని సాయి పల్లవి కూడా షేర్ చేసింది. దీనిపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టి..ఈ లవింగ్ టీం తో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని గీతా ఆర్ట్స్ వారు నాకు మంచి వెల్కమ్ ఇచ్చారు. నాగ చైతన్య కలిసి మరో స్పెషల్ సినిమా చేస్తున్నాను. అందుకు చాలా సంతోషంగా ఉంది అని అలాగే నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులకి మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను చైతన్య 23వ సినిమాతో అయితే మళ్ళీ కలవబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను” అని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీనితో తెలుగు సాయి పల్లవి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు..!!

happy birthday Krithi Shetty!

Rashmika Mandanna roped in for Ravi Teja’s next?