in

rashmika mandanna: ‘nuvvu na family raa anand’

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ  సోదరుడు ఆనంద్ దేవరకొండ  నటించిన సినిమా ‘గం. గం. గణేశా’. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మే31న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించింది. నేషనల్ క్రష్ రష్మిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈక్రమంలో ఆనంద్-రష్మిక మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రష్మికను ఆనంద్ పలు ప్రశ్నలు అడిగారు. వాటిలో..మీతో కలిసి నటించిన హీరోల్లో మీ ఫేవరేట్ ఎవరు అనే ప్రశ్న అడిగారు. దీనికి రష్మిక.. ‘ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా. ఇలా ఇరికిస్తే ఎలా..? అని అంటూనే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ’ అని సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంతో అప్పటికే విజయ్, ఆనంద్ అభిమానులు కామ్రేడ్.. కామ్రేడ్.. అని అరుస్తూండగా రష్మిక సమాధానంతో పెద్ద ఎత్తున సందడి చేశారు. విజయ్-రష్మికపై గతం నుంచీ వస్తున్న వార్తలకు రష్మిక సమాధానమే క్లారిటీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి..!!

king Virat Kohli’s favorite Telugu star unveiled!

Ravi Teja’s ‘tnr’ first ever indian film to release in the sign language!