రష్మిక మండన్న ప్రధాన పాత్రలో ఓ సినిమా ప్రకటితమైన సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం తొలుత అనుకున్నది రష్మిక మండన్ననేనా.? అన్న విషయమై ఆసక్తికరమైన చర్చ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. వాస్తవానికి, రాహుల్ రవీంద్రన్ ఈ కథని సమంతని దృష్టిలో పెట్టుకుని తయారు చేశాడట. రాహుల్ సతీమణి చిన్మయి సింగర్ అలాగే, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సమంతకే ఎక్కువగా వాయిస్ ఇస్తుండేది చిన్మయి. సమంతకి చిన్మయి అత్యంత సన్నిహితురాలు.
అలా సమంతకి రాహుల్ కూడా సన్నిహితుడే..కాగా, గతంలో సమంత చేయాల్సిన ఓ సినిమా, రష్మిక చేతికి వెళ్ళింది. ఇప్పుడు ఇంకోసారి..అంటూ చర్చ జరుగుతోంది సినీ వర్గాల్లో. ‘అబ్బే, అదేం లేదు. ఈ కథ కోసం రష్మిక మండన్న పేరునే అనుకున్నాం..’ అంటూ ఇంకో వెర్షన్, టీమ్ నుంచి వినిపిస్తోంది. అన్నట్టు, మధ్యలో మృనాల్ ఠాకూర్ పేరు కూడా చర్చల్లోకి వచ్చిందట. కానీ, అనూహ్యంగా రేసులోకి రష్మిక వచ్చిందన్నది తాజా ఖబర్. నిజమేనా.? నిప్పు లేకుండా పొగ అయితే రాదు కదా..!!