in

rashmika clarifies rumors about ravi teja’s movie!

ష్మిక ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా కొన్ని తెలుగు ప్రాజెక్టుల విషయంలో రష్మిక మండన్నా పేరు వినిపిస్తోంది. కొత్తగా కొన్ని ప్రాజెక్టులపై రష్మిక సైన్ చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ, తాను ఏ కొత్త ప్రాజెక్టుకీ సైన్ చేయలేదని రష్మిక తాజాగా వెల్లడించింది. అంటే దీనర్ధం..ఇంతవరకూ వస్తున్న ప్రచారంలో నిజం లేదు. అంతా హంభక్కే అని స్పష్టత వచ్చేసింది. మాస్ రాజా రవితేజ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ అంటూ ఈ మధ్య ఓ ప్రచారం జోరుగా వినిపించింది. వెనకా ముందూ చూడకుండా. పలు మీడియా సంస్థలు వేడి వేడిగా ఈ కాంబోపై కథనాలు వండి వడ్డించేశారు.

అయితే, రష్మిక వెంటనే రెస్పాండ్ అయ్యింది. అలాంటిదేం లేదని తేల్చేసింది..బాలీవుడ్‌లో ‘యానిమల్’ సినిమా రష్మికకు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అలాగే తెలుగులో ‘ఫుష్ప 2’ కూడా. ఈ రెండూ భారీ ప్రాజెక్టులు ఆమెకి. పది సినిమాలు చేసినా కూడా రానంత ఫేమ్ ఈ రెండు సినిమాలతో రష్మిక దక్కించేసుకోగలదు రిజల్ట్ అనుకున్న విధంగా వస్తే. ఆ రేంజ్ హై ఎక్స్‌పెక్టేషన్ మూవీస్ ఇవి. ఇకపోతే, రవితేజ సినిమా విషయానికి వస్తే, మొదట శ్రీలీల అన్నారు. ఆ తర్వాత రష్మిక పేరు తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరూ కాకపోతే మరింకెవరు.? మృణాల్ పేరు పరిశీలనలో వుంది. మీనాక్షి కూడా రేస్‌లో వుంది..!!

Prabhas and Nayanthara likely to reunite after 16 years!

Chiranjeevi’s Epic Fantasy with Aishwarya Rai?