in

rashi khanna roped in for gopichand’s next with maruthi!

రాశీఖ‌న్నా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో న‌టిస్తూ బిజీగానే ఉంది. 2014లో వ‌చ్చిన ఊహ‌లు గుస‌గుస‌లాడే అనే చిత్రంలో క‌థానాయికగా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న రాశీ ఖ‌న్నా ఇటీవ‌ల విడుద‌లైన‌ జై ల‌వ‌కుశ‌,ట‌చ్ చేసి చూడు , తొలి ప్రేమ చిత్రాల‌తో ఆక‌ట్టుకుంది. ఇక తమిళంలోను తన హ‌వా చూపిస్తున్న రాశీ ఖ‌న్నా.. అధర్వకు జోడీగా ‘ఇమైకా నొడిగల్‌’ అనే చిత్రం చేసింది. ఈ చిత్రంతో త‌మిళ తెర‌కి ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత జయం రవికి జోడీగా ‘అడంగామరు’, విశాల్‌కి జోడీగా అయోగ్య అనే చిత్రాల‌లో న‌టించింది. ఇది ఇలా ఉండగా..

గోపీచంద్… మారుతి దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చేప్పారు. అయితే గోపీచంద్- మారుతి దర్శకత్వంలో రానున్న సినిమా హిందీ జానీ-ఎల్ఎల్‌బీ సినిమాకి రీమేక్‌కా తెరకెక్కుతోంది. అంతేకాకుండా ఈ సినిమాకి పక్కా కమర్షియల్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎవరు చేయనున్నారన్న విషయం పై క్లారిటీ రాలేదు. తాజాగా మారుతి ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశీఖన్నాను ఫిక్స్ చేయాలని చూస్తున్నారంట. మారుతి గత సినిమా ప్రతి రోజు పండగే సినిమాలో రాశీ పనితీరు నచ్చడంతో ఈ సినిమాలో కూడా అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారంట.

pooja hegde revealed about her first remuneration!

Priyanka Chopra to feature in a special song in ‘Salaar’?