కథానాయికలకు ఓ ఆశ తప్పకుండా ఉంటుంది. తాము కూడా హీరోల్లా ఫైటింగులు చేయాలని, వాళ్లలా థియేటర్ల ముందు పెద్ద పెద్ద కటౌట్లు పెట్టించుకోవాలని కలలు కంటుంటారు. ఆ అదృష్టం కొంతమందికే రాసుంటుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథలు వస్తే.. తప్ప ఈ కలలు నెరవేరవు. ప్రస్తుతానికి రాశీఖన్నా కూడా అలాంటి కథల కోసమే ఎదురు చూస్తోంది. ఇది వరకు తన దగ్గరకు ఇలాంటి కథలొచ్చాయని,
అయితే.. అప్పట్లో తన అనుభవం సరిపోదనిపించి పక్కకు పెట్టానని, ఇప్పుడు కథనంతా నడిపించగల సామర్థ్యం తనకొచ్చిందనిపిస్తోందని చెప్పుకొచ్చింది రాశీ. “లేడీ ఓరియెంటెడ్ కథల్లో మెప్పించడం అంత సులభం కాదు. నాక్కూడా సినిమా అంతా కనిపించాలని, ఫైటింగులు చేయాలని వుంది. కానీ.. అంత శక్తిమంతమైన కథలు రావాలి. ప్రస్తుతానికైతే నేను అలాంటి కథల కోసం ఎదురు చూస్తున్నా“ అని మనసులోని మాట బయటపెట్టింది..