in

rana’s new look shocks his fans!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]టా[/qodef_dropcaps] లీవుడ్ హంక్ అంటే టక్కున గుర్తుకువచ్చే పేరు రానా దగ్గుబాటి, రాజమౌళి డైరెక్షన్ లొ వచ్చిన బాహుబలి చిత్రం లొ విలన్ గ నటించి మన ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు ఈ బల్లాల దేవుడు. ఇంతకీ గుర్తింపు వచ్చి తన కెరియర్ ని ఓ రేంజ్ ని తీసుకపోవడానికి కారణం బాహుబలి కోసం రానా తన బాడీ కి చేసిన ట్రాన్స్ఫర్మేషన్. కండలు వీరుడు గ విలన్ గ అద్భుతంగా నటించాడు రానా. అలాంటి ముస్క్యూలర్ లుక్ లొ చుసిన రానా ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లుక్ లొ చూసి ఆందోళన చెందుతున్నారు ఫాన్స్.

గత కొంత కాలంగా రానా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నాడు అనె వార్తలు బలంగా వినిపించాయి, దీని కారణం కూడా లేకపోలేదు. రానా ఇది వరకే రీసెంట్ గ తన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియా లొ అప్లోడ్ చేయగా వాటిలో అతను చాల స్లిమ్ అండ్ వీక్ గ కనిపించాడు దాంతో నిజంగా అతనికి కిడ్నీ సంబంధిత వ్యాధి సోకిందని అంత అనుకున్నారు. ఐతే, ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని రానా ఇదే వరకే చెప్పుతూ వచ్చాడు.

తాజాగా రానా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో అభిమానులని నిజంగా షాక్ కి గురిచేస్తోంది. ఈ ఫొటోలో రానా మరింత స్లిమ్ అయ్యాడు . ఈ స్థాయిలో రానా వెయిట్ లాస్ ఎందుకవుతున్నాడనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది, చాల మంది ఫాన్స్ కామెంట్ చేస్తూ ఒకటే విషయం అడుగుతున్నారు ” రానా, అర్ యు అల్ రైట్” అని. మరి రానా తొందర్లోనే తన బాడీ స్లిమ్ లుక్ గురించి క్లారిటీ ఇస్తే బాగుంటది అని సాగుతూ అభిమానుల ఫీలింగ్.

puri brings Delhi model for his son!

gopichand kept all his hopes on Chanakya!