in

rana reveals his honeymoon spot!

నెల 8న ఇరు కుటుంబాల అంగీకారంతో రానా, మిహీకా బజాజ్‌ల వివాహం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న రానా త్వరలో హనీమూన్‌కి వెళ్లాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని ఇటీవల ఓ టాక్ షోలో రానా వెల్లడించారు. వివాహం తరువాత తొలిసారి రానా బాలీవుడ్ హీరోయిన్ నేహా దూపియా నిర్వహిస్తున్న టాక్ షో `నో ఫిల్టర్ నేహా` టాక్ షోలో పాల్గొన్నారు.

జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన ఈ టాక్ షోలో రానాపై నేహా దూపియా పలు ఆసక్తికర ప్రశ్నల్ని సధించింది. అంతే ఆసక్తికరంగా, స్పాంటెనియస్‌గా నేహా సంధించిన ప్రశ్నలకు రానా సమాధానాలు చెప్పారు. హనీమూన్‌కి ఎప్పుడు, ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారని నేహా అడిగిన ప్రశ్నకు రానా టక్కున సమాధానం చెప్పారట. కరోనా వైరస్ ప్రభావం లేకపోతే నెదర్లాండ్స్ క్యాపిటల్ సిటీ అయినటువంటి ఆమ్స్టర్డామ్ కు వెళ్లాలనుకున్నారట. పేయింటింగ్స్ అంటే తనకు చాలా ఇష్టమని, సుందరమైన ప్రదేశమని అందుకే అక్కడికి హనిమూన్‌కి వెళ్లాలనుకున్నామని రానా వివరించారట.

aishwarya rajesh to play a different role!

thamanna to turn villain for vijay!