in

Rana Daggubati film with Black Magic!

టాలీవుడ్ లో కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలు ఎంచుకుంటూ వైవిద్యభరితమైన పాత్రలు పోషిస్తున్న రానా… తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకున్నారు. ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే ఈ కొత్త పెళ్లి కొడుకు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ స్టోరీని ఓకే చేశారని తెలుస్తోంది. సీనియర్ దర్శకులు మణిరత్నం శిష్యుడు మిలింద్ రావ్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుందని, జనవరి నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

గతంలో ‘గృహం’ లాంటి హారర్ సినిమాతో భయపెట్టిన మిలింద్ రావ్.. ఇటీవలే రానాకు తన వద్ద ఉన్న మరో హారర్ కథ వినిపించారట. చేతబడి, క్షుద్రపూజల నేపథ్యంలో ఉన్న ఈ స్టోరీ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట రానా. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. తెలుగులో ‘ధీరుడు’ అనే స్ట్రాంగ్ టైటిల్ పరిశీలనలో పెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే.. రానాకు ఇదే మొదటి హారర్ మూవీ అవుతుంది.

rakul preet singh challenged her fans!

rashmika as Guest Editor for upasana’s ‘urlife’!