in

rakul’s real love story became minus for her film career!

స్పైడర్’ సినిమా రకుల్ ప్రీత్ కెరీర్ ని తలకిందులు చేసేసింది. ఈ సినిమా రిజల్ట్ తో టాప్ లీగ్ లో వున్న రకుల్ ఒక్కసారిగా కిందకుపడిపోయింది. టాప్ హీరోల సినిమా అవకాశాలు రావడం తగ్గిపోయింది. చాలా గ్యాప్ తర్వాత నాగార్జున లాంటి సీనియర్ హీరోతో చేసిన మన్మధుడు 2 కూడా దారుణంగా విఫలమైయింది. దీని తర్వాత బాలీవుడ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్కడ కూడా కలసి రాలేదు. కొంత విరామం తర్వాత కొండపోలంలో చేసిన పాత్రకు మంచి పేరు వచ్చింది కానీ అవకాశాలు మాత్రం జోరందుకోలేదు..అయితే ఇప్పుడు అవకాశాలు కాదు కదా రకుల్ ని సంప్రదించడమే మర్చిపోయారు తెలుగు నిర్మాతలు.

దీనికి కారణం..ఇటివలే తన రిలేషన్ షిప్ ని ఓపెన్ గా ప్రకటించింది రకుల్. జాకీ భగ్నానీతో ప్రేమలో వున్నట్లు మనసులో వున్న మాట చెప్పేసింది. మన జీవితాల్లో తల్లిదండ్రులు, సిస్టర్స్, బ్రదర్స్ , ప్రెండ్స్ ఎలా ఉంటారో… అలాగే మనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి కూడా ఉంటాడని, నా జీవితంలో ఆ ప్రత్యేకమైన వ్యక్తి భగ్నానీ అంటూ ఓపెన్ అయ్యింది..నిజానికి ప్రేమ వ్యవహారం తప్పుకాదు కానీ సెలబ్రేటీలకు మాత్రం కొన్ని రిలేషన్ షిప్స్ కెరీర్ పై ప్రభావం చూపిస్తాయి. నిర్మాతలు .. రకుల్ ఆప్షన్ ని తీసేయడానికి కారణం జాకీ భగ్నానీతో అనుబంధమేనని వినిపిస్తుంది.

senior NTR’s Daughter Uma Maheswari Passes Away!

“ARAKKONAM RAO”!