ఏ షయం గురించైనా నిర్మొహమాటంగా మాట్లాడే రకుల్.. బంధుప్రీతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పరిశ్రమలో నెపోటిజం ఉన్నమాట వాస్తవం. నేను దీని కారణంగా అవకాశాలు కోల్పోయాను. అవి నాకు దక్కలేదని బాధ పడలేదు. ఆ సినిమాలు నన్ను ఉద్దేశించినవి కాదని ముందుకుసాగాను. నా తండ్రి సైన్యంలో పనిచేసేవారు. ఆయన సలహాలు, అనుభవం నాకు ఎన్నో నేర్పాయి. చిన్నచిన్న వాటి గురించి ఆలోచించను. అవకాశాలు కోల్పోవడం జీవితంలో ఓ భాగం. నాకు దక్కని వాటి గురించి ఆలోచించి సమయం వృథా చేసుకోను. ఏం చేస్తే నేను వ్యక్తిగతంగా ఎదుగుతానో దానిపై శ్రద్ధ పెడతాను. ఒక స్టార్ కిడ్‌కు లభించినంత సులభంగా మిగతా వారికి ఛాన్స్‌లు రావు. అదంతా వారి తల్లిదండ్రుల కష్టం’ అని రకుల్ వివరించారు..!!