దక్షిణాదితోపాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన రకుల్ తన తొలి రోజు షూటింగ్ అనుభవాలను పంచుకుంది. రకుల్ తొలిసారి ఓ కన్నడ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం చేసిన ఫస్ట్ షాట్ వివరాలను పంచుకుంది. `అప్పుడు నా వయసు 18. ఢిల్లీలో డిగ్రీ చదువుతున్నాను. కన్నడ మూవీ ఆఫర్ వచ్చింది. దక్షిణాదిన కూడా ఓ సినిమా పరిశ్రమ ఉందని అప్పటివరకు నాకు తెలియదు. షూటింగ్‌కు ఒక్క రోజు ముందు అక్కడకు వెళ్లాను.
ఎలాంటి రిహార్సల్స్ లేవు. అయినా నా తొలి షాట్‌ను బాగా చేయగలిగాను. బాగా చేశానని అంతా మెచ్చుకున్నారని రకుల్ తెలిపింది. అలాగే తెలుగు కంటే ముందు హిందీ సినిమా `యారియాన్` చేశానని, అయితే ఆ సినిమా విడుదల బాగా ఆలస్యమైందని పేర్కొంది. `ఆ సినిమా కంటే ముందు తెలుగులో చేసిన సినిమా విడుదలై హిట్ అయింది. దాంతో తెలుగు నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి. హిందీపై దృష్టి పెట్టలేకపోయాను. టాలీవుడ్‌కే ఫిక్స్ అయిపోయాను. తెలుగు ప్రేక్షకుల ప్రేమను చూసి ఇంకేం ఆలోచించలేకపోయాన`ని రకుల్ పేర్కొంది.