తేజ దర్శకత్వంలో రానా కథానాయకుడిగా ‘నేనే రాజు – నేనే మంత్రి’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. హీరోగా ఈ సినిమా రానాకి హిట్ ఇచ్చింది. అలాగే చాలా కాలం తరువాత తేజకి కూడా ఆ సినిమా విజయాన్ని అందించింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘రాక్షసరాజు’ అనే సినిమా రూపొందనున్నట్టుగా వార్తలు వచ్చాయి. యాక్షన్ – ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ ఇది..
ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉంటాయని అంటున్నారు. ఇది ‘బావ – బావమరిది’ కథ అని తెలుస్తోంది. తన బావ అంటే ఆ బావమరిదికి ఎంతో అభిమానం..ఆయన మాట అంటే వేదం. అయన కోసం ఆ బావమరిది ఎంతదూరమైనా వెళతాడు. ఎంతకైనా తెగిస్తాడు. అలాంటి బావమరిది పాత్రను రానా పోషించనుండగా, బావ పాత్ర కోసం మోహన్ లాల్ ను సంప్రదిస్తున్నట్టుగా సమాచారం..!!