in

rajinikanth’s ‘Jailer’ villain Vinayakan Arrested For Creating nonsense!

జినీకాంత్ హీరోగా ఇటివల వచ్చిన జైలర్ సినిమాలో విలన్ గా నటించి విశేష క్రేజ్ తెచ్చుకున్న వినాయకన్ ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. తోటి అపార్ట్ మెంట్ వాసులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మద్యం సేవించిన వినాయకన్ తాను నివాసముంటున్న అపార్ట్ మెంట్లో గొడవకు దిగినట్టు తెలుస్తోంది. తమను ఇబ్బంది పెడుతూండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అతడిని వారించినా వినకుండా గొడవకు దిగడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం వినాయకన్ ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. వినాయకన్ గతంలోనూ ఓ మోడల్ ను వేధించిన కేసులో అరెస్ట్ అయ్యారని..బెయిల్ పై విడుదలైనట్టు జైలర్ విడుదల సమయంలో తమిళ, మలయాళ మీడియాలో వార్తలు వచ్చాయి..!!

rakul preet gets a call from mega team?

dil raju compares sreeleela with sridevi and Jaya Prada!