in

dil raju compares sreeleela with sridevi and Jaya Prada!

భ‌గ‌వంత్ కేస‌రి’ సినిమాలో శ్రీలీల పాత్రకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందులో బాల‌య్య కుమార్తె పాత్ర పోషంచిన శ్రీలీల న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని బాగా ఆకట్టుకుంది.  ఆమె నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. అద్భుతంగా నటించిందని అభినందిస్తున్నారు. తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు సైతం ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. శ్రీలీల ఎలాంటి పాత్ర అయిన అవ‌లీల‌గా పోషించ‌గ‌ల‌ద‌ని ఈ సినిమాతో రుజువు అయ్యిందన్నారు. ఆమె కెరీర్ లోనే ఈ పాత్ర గుర్తుండిపోతుందన్నారు.

“‘భగవంత్ కేసరి’ సినిమా విడుదల ముందు వరకు శ్రీలీల అంటే మంచి డ్యాన్సర్ అని అనే వారు. నేను అలాగే అనుకునేవాడిని. కానీ, ఈ చిత్రంలో ఆమె నటన అద్భుతం. శ్రీదేవి, జయసుధ, జయప్రదలను మళ్లీ గుర్తు చేసింది. నటిగా శ్రీలీలకు మంచి భవిష్యత్తు ఉంది. సినిమాలను చక్కగా సెలెక్ట్ చేసుకుంటే గొప్ప స్థాయికి చేరుకుంటుంది. ఇంకా చెప్పాలంటే టాప్ పొజిషన్ కు వెళ్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు” అన్నారు దిల్ రాజు..!!

rajinikanth’s ‘Jailer’ villain Vinayakan Arrested For Creating nonsense!

dusky beauty pooja hegde bags another bollywood biggie!