in

rajinikanth to act finally under his daughter’s direction?

యసు పెరగడంతో ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతుండటంతో ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి విశ్రాంతి తీసుకోబోతున్నాడని చెన్నై సినిమా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుచేతనే ఇటీవల కొంత మంది సిని దర్శకులు కథ చెప్పడానికి వచ్చిన ఆసక్తి చూపలేదని తెలుస్తుంది. ప్రస్తుతం శివ దర్శకత్వం వహిస్తున్న “అన్నత్తే” చిత్రంలో నటిస్తున్న రజినీ ఈ చిత్రం తర్వాత తన చివరి చిత్రాన్ని తన కూతురు సౌందర్య రజినీ దర్శకత్వంలో నటించబోతున్నాడని,  ఆ చివరి సినిమాకి సంబందించిన కథని కూడా సౌందర్య రెడీ చేసి తన తండ్రికి వినిపించిందని టాక్.

ఇప్పటికే రజినీకాంత్ హీరోగా నటించిన 3డి చిత్రం “కొచ్చాడియాన్” సినిమాకి దర్శకత్వం వహించిన సౌందర్య, ధనుష్ హీరోగా “రాఘవన్-2” చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేసింది. మొన్నటి తమిళనాడు ఎన్నికల ముందు కూడా పార్టీ స్థాపించి ఆ తర్వాత తన ఆరోగ్య కారణాల దృష్ట్యా రాజకియంలోకి రాలేనని రజినీకాంత్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి వస్తున్న వార్తల ప్రకారం రజినీ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో చివరి సినిమా నటించి తన 38 ఏళ్ళ సినీ జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నడనే వార్త రజినీ అభిమానులను కలవర పెడుతుంది.

shriya bold and beautiful!

Stand Up Rahul Teaser, Raj Tarun, Varsha Bollamma!