తమిళ డైరెక్టర్ అట్లీకి పరిచయం అవసరం లేదు. ఆయన జవాన్ తర్వాత..అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉండగా..ఆ ప్లాన్ ఇప్పుడు మారింది. ఈప్రాజెక్టు నుంచి అట్లీ తప్పుకున్నాడు. పారితోషికం, బడ్జెట్ దీనికి కారణాలు అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు వేరే తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్‌ఖాన్, రజనీకాంత్ మల్టీస్టారర్‌గా దీన్ని రూపొందిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అట్లీ తన తదుపరి చిత్రం కోసం మరో బాలీవుడ్ సూపర్ స్టార్, సల్మాన్ ఖాన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌లను కలిసి మల్టీ స్టారర్‌గా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఈ చిత్రం జరిగితే భారతీయ చలనచిత్ర చరిత్రలో అతిపెద్ద సహకారం అవుతుంది. మరి ఇద్దరు స్టార్లు దీన్ని అంగీకరిస్తారో లేదో వేచి చూద్దాం..!!